నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో భారతీ ట్రావెల్స్ కు చెందిన మూడు బస్సులు పార్కింగ్ యార్డ్ లో ఉండగా అగ్నికి ఆహుతి అయ్యాయి.
మంటలను గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా, వారు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.