హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. కేపీహెచ్‌బీలో ముగ్గురు చిన్నారులు సెల్లార్ గుంతలో పడి మృతి చెందారు. సెల్లార్ గుంత పక్కనే చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. దీంతో స్థానికంగా విషాదం నెలకొంది. మృతి చెందిన సోఫియా, రమ్య, సంగీత మృతదేహాలకు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తమకు న్యాయం చేయాలని చిన్నారుల కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.
నిర్మాణం కోసం జరిపిన తవ్వకాన్ని అధికారులు పూడ్చకుండా అలాగే వదిలేశారు. దీంతో, అది చెరువులా మారింది. గతంలో కూడా ఇదే గుంతలో పడి ఇద్దరు పిల్లలు మృతి చెందినా.. స్థానిక అధికారుల్లో చలనం రాలేదు. అధికారుల నిర్లక్ష్యం మరో ముగ్గురి పిల్లలను బలితీసుకుంది.