బ్యాంకు వినియోగదారులా.. ఈ నాలుగైదు రోజుల్లో ఏవైనా లావాదేవీల పనులు ఉంటే త్వరపడండి. ఎందుకంటే వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులకూ సెలవులు ఉన్నాయి. ఈనెల 25న క్రిస్మస్, 26 నాలుగో శనివారం, 27 ఆదివారమైనందున బ్యాంకులు మూతబడనున్నాయి. మళ్లీ ఈనెల 28వ తేదీ నుంచి యథాతథంగా పని చేస్తాయి.
సంవత్సరాంతం కావడంతో సాధారణంగానే చాలా మంది వివిధ వేడుకలకు ప్లాన్ చేసుకుంటారు. దీంతో ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు సాధారణమే. అందుకే ముందు జాగ్రత్తగా కావాల్సిన నగదు దగ్గర ఉంచుకుంటే మంచిదని సూచిస్తున్నారు.