రాష్ట్రంలో రానున్న మూడ్రోజుల పాటు మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం తూర్పు -మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైందని, ఫలితంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.
ఉపరితల ఆవర్తనం మరింత బలపడి తీవ్ర వాయుగండం మారే ఛాన్స్ ఉందని, రాబోయే మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.