అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత రెండు రోజులుగా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉధృతంగా పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలు వరదల్లో ములిగిపోయాయి.
Assam | Flood situation in the Dhemaji district remains grim after flood waters submerge more areas under Jonai Sub-Division
As per Assam State Disaster Management Authority (ASDMA), 15,084 people have been affected due to floods in the district | reported by news agency ANI pic.twitter.com/9kXLIHt22r
— NDTV (@ndtv) October 12, 2022
కాగా అస్సాంలో వరదలతో బ్రహ్మపుత్రా నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల రోడ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. పొలాల్లోకి వరద నీరు చేరడంతో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అక్కడి అధికారులు తెలిపారు.
ధేమాజీ, దిబ్రూఘర్, లఖింపూర్ జిల్లాల్లో ఏకంగా 46 గ్రామాలను వదరలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. నదీ తీరంలో నివసించే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
పలుచోట్ల కొండ చరియలు కూడా విరిగి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యాటకులు సైతం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలైన అసోం, అరుణాచల్‌ప్రదేశ్ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అసోంలోని పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. దీంతో అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.