నందమూరి బాలయ్య కొత్త మూవీ న్యూలుక్ అదిరింది. అయితే టైటిల్ ఏమిటన్నది ఆసక్తి రేపుతోంది. రూలర్, జడ్జిమెంట్, డిపార్ట్ మెంట్ ఈ మూడు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. వీటిలో కథాపరంగా ఏది బెటర్ ? అనేది చిత్ర బృందం ఆలోచిస్తోంది. ఫాన్స్ నుంచి ఏమైనా ఒపీనియన్ వస్తుందని ఈ మూడు టైటిల్స్ పేర్లు బయటికి వదిలారు.
కే.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలయ్య లుక్ చూస్తే రూలర్ మాదిరిగా ఉంది. మరో కోణంలో చూస్తే డిక్టేటర్ మాదిరిగా ఇదే నా జడ్జిమెంట్ అనే రీతిలో లుక్ ఉంది. ఇంకో యాంగిల్లో కార్పోరేట్ లుక్ తో ఇది నా డిపార్ట్ మెంట్ అనే విధంగా ఉంది. ఒక మూవీకి మూడు టైటిల్స్ ఆసక్తి రేపుతున్నాయి.
బాలయ్య సరసన అందాల భామలు సోనాల్ చౌహాన్, వేదిక జోడీగా ఉన్న ఈ మూవీ కొత్త షెడ్యూలు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనెల 18న మొదలవుతుంది. అదే రోజు టైటిల్ ప్రకటిస్తారా? షెడ్యూలు ముగిశాక ప్రకటిస్తారా? అనేది తేలాల్సి ఉంది.