కుటుంబ కలహాలతో తల్లి ఇద్దరు పిల్లలు పై కిరోసిన్ పోసి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లోని టీచర్స్ కాలనీలో నివాసముంటున్న మహేష్, నిహారిక దంపతులకు ఇద్దరు పిల్లలు. పెంట్లవెల్లి లో భర్త మహేష్ మొబైల్ షాప్ ద్వారా జీవనం కొనసాగిస్తున్నాడు. కూతురు దీప్తి, బాబు కేథరెన్ పిల్లలు ఉన్నారు. రాత్రి భార్య భర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన భార్య నిహారిక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె ఇద్దరు పిల్లలకు కిరోసిన్ పోసి నిప్పంటించి ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి, పిల్లలు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పట్టపగలు సంఘటన జరగడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. మృతురాలు అత్తను భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.