సరదా సరదాల టిక్ టాక్ ముగ్గురిని జైలుకు పంపింది. దేశీ తయారీ తుపాకీతో హీరోలాగా ఫోజు పెట్టి తీసిన వీడియోను టిక్ టాక్ యాప్ లో అప్ లోడ్ చేసినందుకు ఇద్దరిని… వారికి తుపాకీ అమ్మిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు….వీడియో తీయడానికి ఉపయోగించిన టూ వీలర్ నూ స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ మండ్సర్ జిల్లాలోని మల్హర్ ఘర్ రైల్వే స్టేషన్ రోడ్ లో జరిగింది. అరెస్టయిన వారిలో వీడియో ఫోజు పెట్టిన కన్హయ్య అకా కనా (23), షూట్ చేసిన రాహుల్ దంగార్(18), వారికి రూ. 25000 లకు తుపాకీ అమ్మిన ఫిరోజు లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరిపై ఆర్మ్స్ యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.