జమ్మూ కాశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. పుల్వామా జిల్లా త్రాల్ సెక్టార్‌లో ఉన్న దైవర్ లో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో భారత భద్రత దళాలు సోదాలు చేపట్టాయి. భారత భద్రత దళాల తనిఖీలతో ముష్కరులు సైన్యంపైకి కాల్పులు జరిపేందుకు యత్నించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన భద్రత దళాలు ముష్కరులపైకి ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రత దళాలు మట్టుబెట్టాయి. మృతదేహాలను స్వాధీనం చేసుకొని… వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే మృతుల వద్ద లభించిన ఆయుధాలను సైన్యం స్వాధీనం చేసుకుంది.