రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రాధే శ్యామ్. యూరప్ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అలాగే కృష్ణంరాజు, భాగ్యశ్రీ కీలక పాత్రల్లో నటించారు.
అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాహుబలి వంటి సినిమా చేసిన ప్రభాస్ రాధే శ్యామ్ వంటి లవ్ స్టోరీ చేయడాన్ని సినీ ప్రేక్షకులు అంగీకరించలేక పోతున్నారు. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది ఈ చిత్రం.
అయితే మొత్తం 3 మిస్టేక్స్ ఈ సినిమాకు మైనస్ గా మారాయని కొంత మంది విశ్లేషకులు చెబుతున్నారు. మొదటిది సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నప్పటికీ ప్రభాస్ పూజా హెగ్డే మాత్రమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ప్రభాస్ తల్లి భాగ్యశ్రీ పాత్ర అసలు ఎందుకు ఉందో కూడా తెలియని పరిస్థితి.
మరికొన్ని పాత్రలు అసలు ఎందుకు ఉన్నాయో కూడా అర్థం కాదు. ఏదో పెట్టాం అన్నట్టుగా ఉంటాయి. సీనియర్ నటుడు మురళీ శర్మ కు ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం గమనించాల్సిన విషయం.
ఇక రెండవ మిస్టేక్ బడ్జెట్. కథను బట్టి ఏ సినిమాకైనా బడ్జెట్ ఉంటుంది. కానీ బాహుబలి, సాహో వంటి చిత్రాలు హిట్ కొట్టాయి కాబట్టి ఈ సినిమా కూడా మంచి వసూళ్లను సాధిస్తుందని నిర్మాతలు పెట్టేసారు. ఎంతో ఖర్చు పెట్టి వేసిన సెట్స్ ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో అనుభూతిని కలిగించలేక పోయాయి.
అలాగే మూడవ మిస్టేక్ మ్యూజిక్. లవ్ స్టోరీలకు ముఖ్యంగా కావలసింది మ్యూజిక్. ప్రేక్షకులను మంచి ఫీల్ తో ఆకట్టుకునే విధంగా మ్యూజిక్ ఉండాలి. ఎస్ ఎస్ తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నప్పటికీ పాటలు మాత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.
ఈ సినిమా మ్యూజిక్ ప్రేక్షకులకు ఏమాత్రం కూడా కనెక్ట్ కాలేదు. ఇక ప్రస్తుతం ప్రభాస్ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ప్రాజెక్టు కె, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.