– మూడు తప్పులతో నాలుక కరుచుకున్న ఈడీ
– ఈడీ హిట్ వికెట్
– కవితను జైల్లో పెట్టాలన్న తొందరలో..
– ఈడీ అధికారులు పప్పులో కాలేశారా?
– కవిత కేసులో ఈడీ చేసిన మూడు ప్రధాన తప్పిదాలేంటి?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రూల్స్ ను వాడుకుంటూ కవిత విచారణకు రాలేనని స్పష్టం చేశారు. అయితే.. ఆ ఛాన్స్ కవితకు ఈడీనే కల్పించిందనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా ఈడీ మూడు తప్పిదాలు చేసిందని అంటున్నారు రాజకీయ, న్యాయ పండితులు.
ఒకటి- సెక్షన్ 160 సీఆర్పీసీ కింద మహిళను విచారించే సమయంలో ఇంటికి వెళ్లి విచారించాలి. కానీ, ఈడీ ఆఫీస్ కి పిలవడం ద్వారా మొదటి తప్పు జరిగిపోయింది.
రెండు- కవితను ప్రశ్నించే సమయంలో ఈడీ అధికారులు సీబీఐ అడగాల్సిన ప్రశ్నలు అడిగారా? అవునని చెప్తున్నారు కవిత. ఈడీ కేవలం జరిగిన నేరంలో డబ్బు ఎంత సంపాదించారు.. ఎక్కడ దాచారు? అని మాత్రమే అడగాలి. దాన్నే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటారు. ఫోన్లు వాడడం, ధ్వంసం చేయడం అంతా సీబీఐ పరిధిలోని అంశాలు. లిక్కర్ పాలసీ ఎలా తయారు చేశారు? దాన్ని ఎలా మార్చారు? అన్న ప్రశ్నలు కూడా సీబీఐకి చెందినవే. ఈడీ ఇలాంటివి అడగకూడదు. ఆ థిన్ లైన్ ని మర్చిపోయి అధికారులు ప్రశ్నిస్తే.. వారు ఇబ్బందుల్లో పడక తప్పదు. ప్రిడికేట్ అఫెన్స్ గురించి ఈడీ ప్రశ్నలడిగితే తప్పు చేసినట్టే.
మూడు- ఈడీ పరిధి దాటి సంధించిన ప్రశ్నలు డబుల్ జియోపార్టీగా మారి కేసుకు ఎసరు తీసుకువస్తాయి. రాజ్యాంగంలో ఆర్టికల్ 20, సబ్ ఆర్టికల్ 2 ప్రకారం కేసు గల్లంతవుతుంది. ఆ ధైర్యంతోనే కవిత ఢిల్లీలో తన ఇంట్లో ప్రశాంతంగా గ్రీన్ టీ తాగుతున్నారు. ఈడీ అధికారుల అత్యుత్సాహం ఆమెకు కలిసి వస్తుందా? వేచి చూద్దాం.