దేశంలో కరోనా కేసులు ఇప్పటికీ నమోదు అవుతూనే ఉన్నాయి. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టకుండా మళ్లీ పెరుగుతూనే ఉంది. తాజాగా ఈ రోజు దేశంలో 40 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కరోనా వచ్చి ఏడాది గడిచినా మహమ్మారి నుండి కాపాడటానికి ఔషదాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.
ఈ నేపథ్యంలో తాజాగా మరో మూడు రకాల ఔషధాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా పాజిటివ్ వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుబాటులోకి తీసుకువచ్చే ఓషదాలలో మలేరియా ఔషధం ఆర్టేసునెట్ , క్యాన్సర్ కు వాడే ఇమేటినిబ్, రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు ఉపయోగించే ఇన్ఫ్లిక్సిమాబ్ ఔషధాలను పరిష్కరిశీలించనున్నట్టు తెలిపింది.
ఈ ఓషదాలు అందుబాటులోకి వస్తే కరోనా తో సీరియస్ గా ఉన్న రోగులను బ్రతికించే కొనే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే మలేరియాకు ఉపయోగించే హెచ్ సీ క్యూ మందును కరోనాను తగ్గించేందుకు ఇస్తున్న సంగతి తెలిసిందే.