నెల్లూరుజిల్లా మనుబోలు మండలం బద్వేలు జాతీయ రహదారి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కొడవలూరు మండలం దామేగుంట గ్రామానికి చెందిన రెండు కుటుంబాలకు చెందిన వారు చెన్నైకి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బద్వేలు జాతీయ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. రెప్పపాటులో వాయువేగంతో దూసుకుపోతుంటాయి.
ట్రక్ డ్రైవర్ రోడ్డు పక్కన కాలకృత్యాలు తీర్చుకుంటుండగా అది గమంచని ఇన్నోవా డ్రైవర్ ఆగివున్న ట్రక్కును వెనుక నుంచి వేగంగా ఢీ కొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స కోసం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.