ఇటీవల కాలంలో కరోనా కారణంగా రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకోగ ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జలంతరకోట 5 వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ రోజు వేకువజామున ప్రమాదం జరిగింది. ఒడిశా వైపు నుండి విశాఖకు వస్తున్న స్కార్పియో వాహనం ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో స్కార్పియో వాహనంలో ఆరుగురు వ్యక్తులు ప్రయాణం చేస్తుండగా ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలించారు.