సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జానపాడు రైల్వే ట్రాక్ దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
మృతుల్లో ఇద్దరు మిర్యాలగూడ మండలం జంకుతండాకు చెందిన ధరావత్ పుణ్య, మగతి భార్యాభర్తలుగా గుర్తించారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ఘటన అనంతరం అతను పరారయ్యాడు. పోలీసులు గాలిస్తున్నారు.