అతి వేగం ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. కడప జిల్లాలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. రాజంపేట మండలం మందరం గ్రామంలో జరిగిందీ ఘటన.
పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతులను ఒబిలి శివ (30), ఆవుల చిన్నబ్బి (50), హారిక (3)గా గుర్తించారు.
ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అతివేగమే యాక్సిడెంట్ కు కారణమని చెబుతున్నారు.