కూలి పని కోసం వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వారిలో ముగ్గురు వ్యక్తులు గల్లంతైన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ కు చెందిన కొంతమంది పొట్టకూటి కోసం వరికోత పనికి ముదిగొండ మండలంలోని కట్టంకూరుకు వచ్చారు. అయితే శివారులోని సాగర్ కాలువకు స్నానానికి వెళ్లి ఎంత సేపటికి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు స్థానికులకు చెప్పారు.
కుటుంబసభ్యులతో కలిసి స్థానికులు గాలింపు మొదలు పెట్టారు. కొద్ది సేపటికి సాగర్ కాలువ కట్టమీద వారి సెల్ఫోన్లు, చెప్పులు కనిపించాయి. గట్టు మీద వాటిని ఉంచి.. స్నానానికి దిగి గల్లంతైనట్లు భావిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.