వరద నీటిలో కొట్టుకుపోయి చెట్ల పొదల్లో ఇరుక్కుపోయిన ముగ్గురు విద్యార్థులను కాపాడారు గ్రామస్తులు. హన్మకొండ జిల్లా దామెర మండలం పసరగొండలో జరిగిందీ సంఘటన.
స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్తున్నారు. అయితే మార్గమధ్యంలో ఉండగా భారీ వర్షం పడింది. పైగా వర్షానికి రోడ్డు కోతకు గురైంది. అది గమనించకపోవడంతో విద్యార్థులు వరదనీటిలో కొట్టుకుపోయారు.
ముగ్గురు పిల్లలు చెట్ల పొదలను పట్టుకొని కేకలు వేశారు. అవి గమనించిన స్థానికులు తాళ్ల సాయంతో వారిని కాపాడారు.