నిద్రిస్తున్న విద్యార్థులను పాము కాటేసిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. ఒకే సారి ముగ్గురు విద్యార్థులను పాము కాటువేసింది.
ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… విజయనగరం జిల్లా కురుపాం జ్యోతిబాపులే బిసి వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు రాత్రి పడుకున్న సమయంలో పాము కాటువేసింది.
పాముకు కాటుకు గురైన విద్యార్థులు మంతిని రంజిత్, ఈదుబుల్లి వంశీ, వంగపండు నవీన్‌గా అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ ముగ్గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ ఆసుపత్రికి తరలించారు.