టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యే ఇమేజ్ ఉన్నా సరే కొందరు మాత్రం మంచి అవకాశాలు తెచ్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. పెద్ద దర్శకులతో పెద్ద హీరోలతో చేసినా సరే వాళ్లకు మంచి గుర్తింపు మాత్రం రాదూ. టాలీవుడ్ లో ఏళ్ళ తరబడి ఉన్నా సరే వాళ్ళ పేరు మాత్రం నానుతూ ఉంటుంది గాని చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోయిన్ గా చెలామణి అవుతూ ఉంటారు. అలాంటి హీరోయిన్ లను ఒకసారి చూస్తే…
తమన్నా: మిల్కీ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న ఈ ఢిల్లీ హీరోయిన్ కు అదృష్టం కలిసి వచ్చినా తెర మీద స్పేస్ దొరకలేదు. ఆమె భిన్నమైన పాత్రలు చేసిన దాఖలాలు లేవు. ఎప్పుడూ లవర్ పాత్రలో మాత్రమే ఆమె కనపడుతూ ఉంటుంది. మొదటి సినిమా నుంచి ఇప్పుడు చేసే సినిమా వరకు అన్ని ఆమె లవర్ పాత్రల్లోనే ఉన్నారు. బాహుబలి లాంటి సినిమాలో కూడా అదే పాత్ర పోషించింది. ఇక ఆ సినిమాలో ఆమె నటించారు అనే పేరు ఒకటే మిగిలింది.
రకుల్ ప్రీత్ సింగ్: టాలీవుడ్ లో మరో అన్ లక్కీ హీరోయిన్ రకుల్. కొన్నాళ్ళు వివాదాలు ఇబ్బంది పెడితే మరికొన్ని రోజు ఐరన్ లెగ్ అనే పేరు ఇబ్బంది పెట్టింది. ఇక మంచి పాత్రలు ఆమె ఎప్పుడూ చేయలేదు. హీరోయిన్ గా మంచి అవకాశాలు ఆమెకు వచ్చినా సినిమాలు అనుకున్న విధంగా హిట్ అవ్వలేదు. ప్రతీ సినిమాలో కేవలము 20–30 నిమిషాలే ఉంటుంది తన పాత్ర. తెలుగులో ఈ కాలంలో కనీసము ఒకటో రెండో విభిన్నమైన పాత్రలు చేస్తే మాత్రమే ఫాన్స్ గుర్తు పెట్టుకుంటారు. కానీ ఆమె చేసిన ఏ పాత్ర కూడా గుర్తింపు రాలేదు.
ప్రణీత: టాలీవుడ్ లో మంచి హీరోయిన్ అయ్యే అదృష్టం ఉన్నా సరే ఆమెను సెకండ్ హీరోయిన్ గా లేదంటే హీరోయిన్ అక్కగానే చూసారు. మంచి పాత్రలు చేసే అవకాశం ఉన్నా సరే ఆమెకు రాలేదు. స్టార్ హీరోల సినిమాల్లో కనపడినా సరే హీరోయిన్ గా నిలబడలేదు. అందం అభినయం ఉన్నా సరే ఆమెకు మంచి పాత్రలు దక్కలేదు.