చింతమనేని ప్రభాకర్‌కు మూడేళ్ల జైలు
ఈసారి ఎన్నికల్లో నో ఎంట్రీ..!
ఏలూరు: అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యేగా ముద్రపడిన చింతమనేని ప్రభాకర్‌కు జిల్లా కోర్టు మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. గత 2014 ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గం నుంచి గెలిచిన చింతమనేని రాజకీయాల్లో సంచలన నేతగా మారారు. మహిళా అధికారిని దూషించిన కేసులో చింతమనేని ప్రభాకర్ వల్ల మొన్నటి ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన పార్టీయే ఘోర పరాజయాన్ని ఎదుర్కోవాల్సివచ్చిందని విశ్లేషకులు చెబుతారు. దళితులను అనేకసార్లు దూషించారని ఆయన మీద ఆరోపణలు వున్నాయి. ఇటీవల చింతమనేని ఆయను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. రిమాండ్‌కు తరలిస్తున్న సమయంలో కోర్టు ఆవరణ ముందే చింతమనేని మరోసారి పోలీసుల్ని దుర్భాషలాడుతూ రెచ్చిపోయారని వార్తలొచ్చాయి.