మోడీ పాలనలో దేశ ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని విరుచుకుపడ్డారు ఏపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. మాటల్లో అచ్చే దిన్, చేతల్లో చచ్చే దిన్ అన్నట్టు మోడీ పాలన సాగింస్తున్నారని విమర్శలు గుప్పించారు.
బీజేపీ ప్రభుత్వం పదే పదే వంట గ్యాస్, వాణిజ్య సిలిండర్ల ధర పెంచడం అమానుషం, అమానవీయం అన్నారు. మదర్స్ డే సందర్భంగా వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెంచి.. మహిళలకు తీరని అన్యాయం చేసిందని అన్నారు.
గతంలో కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పుడు.. వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.410 ఉండేదని.. ఇప్పుడు బీజేపీ పాలనలోకి వచ్చిన తర్వాత రూ.1030 లకు పెంచి దేశ ప్రజల నెత్తిన బండను మోపారని విరుచుకుపడ్డారు.
మాటల్లో సబ్ కా వికాస్, చేతల్లో సబ్ కా వినాస్ అనే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మహిళల కన్నీటి వరదలో బీజేపీ ప్రభుత్వం కొట్టుకుపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని శపించారు తులసిరెడ్డి.