తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శుక్రవారం కలియుగ శ్రీ వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు టీటీడీ ఆలయ అధికారులు తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వ దర్శనం కలుగుతుందని వెల్లడించారు.
కాగా గురువారం స్వామివారిని 60,609 మంది భక్తులు దర్శించుకోగా 23,394 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.13 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
అలాగే ఫిబ్రవరి 5వ తేదీన పౌర్ణమి సందర్భంగా గరుడ సేవను వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఆలయ అధికారులు ప్రకటించారు.
ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారన్నారు.