నయనతార…. ఈ పేరును సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 20 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు హిట్లు, ప్లాపులతో స్టార్ హీరోయిన్ గా నిలిచింది. గ్లామరస్ పాత్రలు చేస్తూనే… మరోవైపు లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా అదరగొట్టింది.
అలాగే నయన్ భర్త విఘ్నేష్ శివన్ కూడా కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకున్నాడు. అయితే వివాహానికి ముందు ఎప్పటినుంచో ఈ ఇద్దరూ ప్రేమ లో ఉన్నారు. ఆ విషయం అందరికి తెలిసిందే. ఎట్టకేలకు ఇప్పుడు ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
ఈ లక్షణాలు ఉన్న అమ్మాయిలని అస్సలు పెళ్లి చేసుకోకూడదట..! చేసుకుంటే ఆ అబ్బాయిల జీవితం సర్వనాశనమే ..!
అయితే ఈ ఇద్దరి ప్రేమకి మొదట బీజం పడింది నేను రౌడీనే సినిమా టైంలోనట. ఈ సినిమా కోసం పని చేస్తున్న సమయంలోని నయనతార కు విగ్నేష్ కు ఒకరిపై ఒకరికి మంచి అభిప్రాయం కలిగిందట. షూటింగ్ సమయంలోనే ఈ ఇద్దరి ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఆ సమయంలో ఈ ఫోటోలు గురించి స్పందించడానికి ఇద్దరూ ఇష్టపడలేదు.
2017 సంవత్సరంలో అవార్డుల ఫంక్షన్ లో కూడా నయన్ విగ్నేష్ జంటగా కనిపించారు. అప్పటి నుంచి ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కామెంట్లు వచ్చాయి. అలాగే ఓ సందర్భంగా మాట్లాడుతూ నయనతార ఒక మంచి నటి మాత్రమే కాదని మంచి మనసున్న వ్యక్తి అని చెప్పుకొచ్చాడు విఘ్నేష్.
బూతు ఫోటోలు పెట్టే వారిని వదిలేసి నా అకౌంట్ సస్పెండ్ చేస్తారా? అయినా వదలను!!
ఆ తర్వాత కొన్నాళ్లకు నయనతార తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం స్టార్ట్ చేసాడు. అక్కడితో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కన్ఫర్మ్ అయింది. ఆఖరికి 2021లో మార్చి 25న ఈ ఇద్దరికీ నిశ్చితార్థం జరిగింది. 2022 జూన్ 9న వివాహం కూడా జరిగింది.