పెద్దపల్లి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. కొద్ది రోజుల నుంచి పులి సంచరిస్తుండటంతో ప్రజలకు కంటి మీద కునుకులేకుండా పోయింది. కాటారం మండలం గుమ్మళ్ళపల్లి-వీరాపూర్ మధ్య అటవీ ప్రాంతంలో కాపరి ఓదెలు బర్లను మేపుతుండగా మందపై దాడి చేసింది పులి. దాన్ని ప్రత్యక్షంగా చూసినట్టు చెపుతున్నాడు ఓదెలు.
పులి దాడితో భయంతో పరుగులు పెట్టిన ఓదెలు పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. ఆ తర్వాత పులి లేగదూడపై దాడి చేసి చంపేసినట్టు సమాచారం. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.