రాజేంద్రనగర్ ప్రాంతంలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఉదయం స్థానికంగా ఉన్న ఆవుపై చిరుత దాడి చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. దాడి సమయంలో అక్కడే ఉన్న కుక్కలు మొరగటంతో చిరుత పారిపోయింది.
తెల్లవారు జామున 3.30గంటలకు చిరుత వచ్చినట్లు ఫాతీమా ఫామ్ హౌజ్ నిర్వాహకులు ప్రకటించారు. గతంలో ఇదే ప్రాంతంలో మూడు లేగదూడలను చిరుత చంపింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇది వరకు ఇదే రాజేంద్రనగర్ లోని గగన్ పహాడ్ లో చిరుత నడిరోడ్డుపై హాల్ చల్ చేసింది. అటవీశాఖ అధికారులు పట్టుకునే ప్రయత్నం చేశారు. చాలా రోజుల తర్వాత ప్రొ.జయశంకర్ విశ్వవిద్యాలయంలో సంచరిస్తున్న చిరుతను అధికారులు పట్టుకున్నారు.