అమెరికాకు చెందిన డెన్నిస్ అన్వర్….ఆడపులిలా కనిపించేందుకు…తన ముఖానికి, బాడీకి అనేక ఫ్లాస్టిక్ సర్జరీలు చేయించి…దాదాపు 200000 డాలర్ల వరకు ఖర్చు చేశాడు.1985 నుండి బాడీ మోడిఫికేషన్ చేయడాన్ని ప్రారంభించిన డెన్నిస్… ఇప్పటి వరకు 14 ప్లాస్టిక్ సర్జరీలు చేయించాడు. పులి చారల టాటూస్ ముఖం మీదే కాకుండా బాడీ మొత్తం వేయించాడు.
పులిలా కనిపించేందుకు కనురెప్పలను, ముక్కును, నుదుటి భాగాన్ని సర్జరీ చేయించాడు. 1981లో అమెరికన్ నేవీలో ఉద్యోగాన్ని సంపాధించిన డెన్నిస్ తర్వాత తన జాబ్ కు రిజైన్ చేసి ఈ అభిరుచిని పెంచుకున్నాడు… ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ప్రోగ్రామర్ గా పనిచేస్తున్న డెన్నిస్ అనేక టివీ షోలలో కూడా పాల్గొన్నాడు.