పెద్ద పులి ఆ ఊరిని భయపెడుతోంది. రెండు రోజులుగా అక్కడే తిరుగుతూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గోదావరి పరివాహక ప్రాంతమైన సంగేమ్ లో పులి సంచారం కలకలం రేపుతోంది.
గత రెండు రోజులుగా పంటపొలాల్లో తిరుగుతూ తమ కంట పడిందని రైతులు, గొర్రెల కాపరులు చెబుతున్నారు. గ్రామ శివారులో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులకు సమాచారం అందించారు గ్రామస్తులు.
అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించి.. అవి పులి అడుగులేనని ధృవీకరించారు. దీంతో గ్రామస్తులు మరింత భయాందోళనకు గురవుతున్నారు.