శ్రీశైలం ఘాట్ రోడ్డులో పులి సంచరించడం కలకలం రేపింది. రోడ్డుపైనే 20నిమిషాల పాటు పులి నిలబడటంతో భక్తులు హడలిపోయారు. శ్రీశైలం దేవస్థానానికి 10కిలోమీటర్ల దూరంలో ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. ఈ గుడికి సమీపంలోని చిన్నారుట్ల వద్ద భక్తులకు పులి ఎదురుపడింది. రోడ్డుకు అడ్డంగా నిలబడి 20నిమిషాల పాటు రోడ్డుపైనే అటు ఇటు తిరుగుతూ అక్కడే నిల్చుంది. దీంతో వాహనాలన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పులి వెళ్ళిపోయినా అనంతరం భక్తులు అక్కడి నుంచి బయల్దేరారు. పులి సంచారంతో భయాందోళనకు గురైన భక్తులు అటవీ అధికారులకు సమాచారాన్ని అందించారు.