గంటల కొద్ది ఒకే చోట కదలకుండ కూర్చోవటం, అందులోనూ టైట్‌గా ఉండే జీన్స్ వేసుకొని కూర్చోవటం మరణానికి దారి తీస్తుంది. ఔను మీరు చదువుతున్నది నిజమే. 8గంటల పాటు టైట్ జీన్స్‌తో కదలకుండా కూర్చున్నందుకు ఢిల్లీలో ఓ వ్యక్తి ఇలాగే చనిపోవటం అందర్నీ కలవరపెడుతుంది.
ఢిల్లీలో నివాసముండే 30 సంవత్సరాల సౌరబ్ శర్మ అనే యువకుడు తను పనిచేసే ఆఫీసు మెట్లపై సృహాలేకుండా పడిపోయాడు. వెంటనే తోటి ఉద్యోగులు దగ్గరలోని హస్పిటల్‌కు తీసుకెళ్లగా… అసలు విషయం బయటపడింది. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న సౌరబ్‌కు ఏమైందని ఆరా తీస్తే అసలు విషయం తెలిసి ఉద్యోగులంతా షాక్ తిన్నారు.
సౌరబ్‌ను ట్రీట్ చేసిన డాక్టర్ నవీన్ బమ్రీ చెప్పిన విషయాల ప్రకారం… అతను చనిపోయింది పులమోనరీ ఎంబాలిజంతో అని… ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవటం, నాన్‌స్టాప్‌గా డ్రైవ్ చేయటం చేస్తే తన కాళ్లన్ని గట్టిగా తయారైపోతాయి. అలాంటి సమయంలో టైట్ జీన్స్ కూడా ఉంటే… బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఉంటుందని అలాంటప్పుడు గుండెకు, మెదడకు రక్తప్రసరణ జరిగే అవకాశం తగ్గిపోయి… ఇలాంటి మరణాలు సంభివిస్తుంటాయని తెలిపారు.
చాలామందిలో ఇలాంటి క్లాట్స్ జరిగినప్పుడు కార్డియాక్ అరెస్ట్ అంటే… గుండె ఒక్కసారిగా ఆగిపోయి చనిపోతారని, 50శాతం ఇలాంటి కేసులే ఉంటాయని ఆయన తెలిపారు.