టిక్‌టాక్.. స్మార్ట్‌ఫోన్లు ఉన్న యూజర్లకు ఈ యాప్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా భారత్‌లోనే ఈ టిక్‌టాక్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం టిక్ టాక్ పై రెండు ప్రభావాలు బలంగా పడ్డాయి. 1. కరోనా… 2. భారత్ సరిహద్దులో చైనా ఆర్మీ ఓవర్ యాక్షన్ .
ఈ రెండిటి కారణంగా భారత్ లో సోషల్ మీడియా వేదికగా ‘టిక్ టాక్ హటావో’ ఉద్యమమే నడుస్తోంది. అందుకే 4.5 గా ఉన్న టిక్‌టాక్ యాప్ స్టార్ రేటింగ్ ఒక్కసారిగా 1.3కి పడిపోయింది. దేశంలో ఉన్న కొన్ని లక్షల మంది యూజర్లు టిక్‌టాక్‌కు ప్రస్తుతం 1 స్టార్ రేటింగ్ ఇచ్చి గూగుల్ ప్లే స్టోర్‌లో ఆ యాప్‌కు వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల వ్యవధిలో ఆ యాప్‌కు ప్లే స్టోర్‌లో 40 లక్షల కొత్త కామెంట్లు రాగా.. అందులో మెజారిటీ కామెంట్లు నెగెటివ్‌గానే ఉన్నాయి.
ఇంత తక్కవ రేటింగ్ ఉంటే యాప్ ఉంటుందా? :
ఇప్పటికీ టిక్ టాక్ స్మార్ట్ ఫోన్లలో భాగమైంది. ఇప్పటికిప్పుడు టిక్ టాక్ కువచ్చిన నష్టం ఏమీలేదు. కాకపోతే కొత్త యూజర్ ఈ రేటింగ్ ను చూసి డౌన్ లోడ్ చేసుకోడానికి ఇష్టడకపోవొచ్చు…కానీ ఉన్న వాళ్లైతే వాడతారు కాబట్టి యాప్ కి ఏం కాదు.
ఒకవేళ రేటింగ్ 1 కంటే తక్కువకు పడిపోతే….?
4.5 గా ఉన్న టిక్‌టాక్ రేటింగ్ 1.3కి పడిపోయింది. ఇదే నెగెటివిటి కంటిన్యూ అయితే రేపు 1 కి పడిపోద్ది అప్పుడు యాజమాన్యం యూజర్లు ఇచ్చిన 1 స్టార్ రేటింగ్స్ అన్నింటినీ తొలగించేందుకు అవకాశం ఉంటుందని డెవలపర్లు చెబుతున్నారు. సో టిక్ టాక్ బ్యాన్ అయ్యే పరిస్థితి అయితే లేదు.