చైనాకు చెందిన టిక్‌టాక్‌ను సొంతం చేసుకోవాలనే మైక్రోసాఫ్ట్ ఆశలకు గండిపడింది. అమెరికాలో టిక్‌టాక్ కార్యకాలపాలను విక్రయించేందుకు బైట్‌డ్యాన్స్ సుముఖంగా లేదని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత చైనాపై అమెరికా తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఈ క్రమంలో తమ దేశానికి చెందిన సమాచారాన్ని తస్కరిస్తోందన్న ఆరోపణలతో చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్‌పై ట్రంప్ సర్కార్ బ్యాన్ విధించింది. టిక్‌టాక్ ఆపరేషన్స్ అమెరికాలో కొనసాగాలంటే యూఎస్‌కు చెందిన ఏదైనా కంపెనీకి విక్రయించుకోవచ్చని వెసలుబాటు ఇచ్చింది. దీంతో టిక్‌టాక్ యాప్‌ను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ సహా పలు కంపెనీలు పోటీపడ్డాయి. కానీ తాజాగా తమ ఆఫర్‌ను టాక్‌టాక్ యాజమాన్యం తిరస్కరించినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.