డిల్లీ : ఎంత కేంద్ర మంత్రి అయితే ఏం లాభం… ఉండేందుకు ఓ చిన్న గూడైనా ఉండాలి కదా. పార్టీ ఆఫీస్‌లో పనిచేసే స్థాయి నుంచి కేంద్ర సహాయ మంత్రి దాకా ఎదిగారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రంలో చక్రం తిప్పుతున్న ఏకైక నాయకుడు. ఆయనే కిషన్ రెడ్డి.
ఐతే, కేంద్రమంత్రుల కోటాలో డిల్లీలో ప్రతి ఒక్కరికీ బంగ్లా కేటాయిస్తారు. వారి వారి సీనియారిటీ, హోదా, పదవులను బట్టి బంగ్లా కేటాయింపులు చేస్తారు. కిషన్‌రెడ్డికి తుగ్లక్ రోడ్‌లో ఓ బంగ్లాను కేటాయించారు. ప్రస్తుతం ఆ నివాసంలో బీజేపీ సీనీయర్ నేత, మాజీ మంత్రి జయంత్ సిన్హా ఉంటున్నారు. సిన్హా ఇప్పటికే తనకు వేరే బంగ్లా కేటాయించాలని అధికారులను కోరగా అధికారులు ఆయనకు ప్రస్తుతం కేంద్ర మాజీ మంత్రి రాధామోహన్ సింగ్ ఉంటున్న నివాసాన్ని కేటాయించారు. కానీ రాధామోహన్ సింగ్ ఇప్పటి వరకు ఇంకా ఆ బంగ్లా ఖాళీ చేయలేదు. దాంతో సిన్హా కూడా తన ఇల్లు ఖాళీ చేయలేకపోవటంతో కిషన్‌రెడ్డికి వెయిటింగ్ తప్పలేదు. దీంతో ఆయన ఏపీ భవన్‌లో ఉంటూ తన విధులు నిర్వహిస్తున్నారు.