తిరుపతి : ఉగ్రవాదుల కదలికలు వున్నాయన్న సమచారంతో కొండ మీద పోలీసులు అలెర్టయ్యారు. నిఘా పెంచి తిరుపతిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు రాష్ట్రం తమిళనాడులో ఉగ్రవాదుల కదలికలున్నాయన్న నిఘా సమాచారం రావడంతో తిరుపతి అర్బన్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటిస్టున్నట్టు తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బు రాజన్ చెప్పారు. తమిళనాడు నుంచి తిరుపతికి వచ్చే వాహనాలను క్షుణ్నంగా తనిఖీలు చేయాలని ఆయన పోలీస్ సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. అనుమానస్పదంగా ఎవరూ కనిపించినా అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు సూచించారు. తమిళనాడు నుంచి తిరుపతికి వచ్చే మార్గాల్లో పోలీసులు తనీఖీలను ముమ్మరం చేశారు. రేణిగుంట, రామానుజ సర్కిల్, తనపల్లి రోడ్డు మొదలుకుని చంద్రగిరి నుంచి తిరుపతికి వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం, శ్రీకాళహస్తి ఆలయాలకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » కొండపైకి దుండగులు రావచ్చు.. పోలీస్ రెడ్ అలర్ట్