ఎస్ఈసీ నిమ్మగడ్డ, ప్రభుత్వం మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో అధికారులు బలవుతూనే ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసి, ఎన్నికల సంఘం ఆదేశాలను విస్మరించారంటూ పలువురు సీనియర్ అధికారులపై చర్యలు మొదలయ్యాయి.
అయితే, ఎన్నికల కోసం జిల్లాల పర్యటనలో ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ కోసం అత్యుత్సాహాం ప్రదర్శించినందుకు తిరుపతి జేఈవోపై బదిలీ వేటు పడింది. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తిరుపతిలో పర్యటిస్తున్నప్పుడు ఆ కార్యక్రమంలో జేఈవో బసంత్ కుమార్ పాల్గొన్నారు. తన పరిధిలో లేకపోయిన ఎస్ఈసీ పర్యటనలో పాల్గొనటం, నెల్లూరు జిల్లా ఎన్నికల అభ్జర్వర్‌గా కొనసాగుతున్న బసంత్ కుమార్ విధులను పక్కనపెట్టి నిమ్మగడ్డ పర్యటనలో పాల్గొనడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
తిరుచానురు, తిరుమలలో దర్శన ఏర్పాట్లు పర్యవేక్షణ చేసేందుకు సంభందిత అధికారులు ఉన్నా.. ఆగమేఘాల మీద నెల్లూరు నుంచి వచ్చిన బసంత్ కుమార్ వెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారించుకుంది. దీంతో ఆయన్ను బదిలీ చేస్తూ, జిఏడిలో రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. అయితే, ఎన్నికలకు నెల్లూరు జిల్లా అభ్జర్వర్‌గా కొనసాగావచ్చంటూ సీఎస్ బదిలీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.