ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు తిరుపతి పర్యటనను అడ్డుకోవటంపై ఆయన తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టులో నేలపై కూర్చుకొని తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా తను ఎక్కడికైనా వెళ్లేందుకు అవకాశం ఉంటుందని, ఎందుకు పోలీసులు అడ్డుకుంటున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
దీనిపై తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు స్పందించారు. చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదన్నారు. ఆదివారం రాత్రి 11గంటల తర్వాత టీడీపీ నేతలు చంద్రబాబు నిరసన దీక్షకు అనుమతి కోరారని… కానీ ఆ స్థలం తిరుమలకు వెళ్లే భక్తులకు కీలకమైందన్నారు. పైగా తిరుపతిలో దక్షిణాధి రాష్ట్రాల మీటింగ్ కూడా ఉందన్నారు. ఇలాంటి సమయంలో అకస్మాత్తుగా చంద్రబాబు పర్యటనకు అనుమతివ్వలేమని తేల్చి చెప్పారు.
చంద్రబాబును తిరిగి వెనక్కి పంపించేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తుండగా, చంద్రబాబు మాత్రం నిరాకరిస్తున్నారు.