టైటానిక్.. ఈ చిత్రం గురించి తెలియని వారు ఉండరు. ఇది ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో కూడా తెలుసు. ఈ చిత్రం విడుదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. పాతిక సంవత్సరాల సందర్భంగా ఫిబ్రవరి 10 న లియోనార్డో డికాప్రియో- కేట్ విన్స్‌లెట్ నటించిన చిత్రాన్ని మళ్లీ గ్రాండ్ గా విడుదల చేసి వేడుకలు జరుపుకోనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇప్పుడు టైటానిక్ క్లైమాక్స్ గురించి వస్తున్న చర్చలకు ఇంతటితో ముగింపు పలకాలనుకుంటున్నాడు కామెరూన్. ఇందులో రోజ్ ఒక కొత్త ప్రయోగంతో జాక్ ను రక్షించగలదని తెలిపాడు. టైటానిక్ లాస్ట్ సీన్ గురించి సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున చర్చలకు తెరలేపుతున్నారు. టైటానిక్ చిత్రం లో ఓడ ప్రమాదానికి గురైన తరువాత తన ప్రేయసిని కాపాడుతూ.. జాక్ పాత్ర చనిపోతుంది.
అయితే రోజ్ తన పక్కనే ఉన్న ట్రాప్ డోర్ లోకి సరిపోయేలా చేయడం ద్వారా జాక్ జీవితాన్ని ఈజీగా కాపాడవచ్చు అని అభిమానులు భావిస్తున్నారు. జేమ్స్ కామెరూన్ ఇప్పుడు రాబోయే షో టైటానిక్ 25 ఇయర్స్ లేటర్ తో చర్చను పూర్తి చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇది నేషనల్ జియోగ్రాఫిక్ లో ఫిబ్రవరి 5 ఆదివారం నాడు ప్రత్యేక ప్రీమియర్‌గా ప్రదర్శించడం జరుగుతుంది.
అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్నీక్ పీక్ వీడియోలో జేమ్స కామెరూన్ తన ప్రయోగాన్ని ప్రదర్శించడానికంటే ముందుగానే అభిమానుల సందేహాలకు సమాధానాలు చెప్పనున్నాడు. క్లైమాక్స్ సన్నివేశాన్ని మళ్లీ నిర్మించడానికి ఇద్దరు స్టంట్ ఆర్టిస్టులతో కలిసి ప్రయోగాలు మొదలు పెట్టేశాడు కూడా. వాటర్ ట్యాంకులో స్వయంగా దిగి రోజ్ పడుకున్న తలుపు మీద ఇద్దరు ఉండగలరా లేదా అని చూసుకున్నాడు.
అంతకుమునుపే కొన్ని మీడియా ఇంటర్వ్యూల్లో కామెరూన్ జాక్ పాత్ర పొడిగింపు గురించి మాట్లాడాడు. ఒకవేళ జాక్ జీవించి ఉంటే కనకు చిత్ర ముగింపు అనేది అర్థరహితంగా ఉండేదని ప్రస్తావించారు. అందుకే అతను చనిపోవాలి అని వ్యాఖ్యనించారు.