ప్రజల మద్ధతుతో ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లపై సర్కార్ పెత్తనం చలాయించడం దుర్మార్గమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండ రాం అన్నారు.
సర్పంచ్‌లు ఏం పని చేయాలో ఎమ్మెల్యేలే నిర్ణయిస్తున్నారంటూ ఆయన తెలిపారు. హైదరాబాద్ లక్డికపూల్లో సర్పంచ్‌ల ఫోరం, పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో పంచాయతీ రాజ్ చట్టంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ…కాంట్రాక్టుల ద్వారా వచ్చి కమీషన్ల కోసమే సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పని చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అధికారం లేకపోతే వారు ఉండలేరని చెప్పారు. అందుకోసం అవసరమైతే ఎన్ని అక్రమాలైనా చేస్తారంటూ ఆయన ఫైర్ అయ్యారు. సర్పంచులు బలమైన శక్తులతో పోరాడుతున్నారన్నారు.
దానికి తగినట్లుగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. అన్ని పార్టీలతో చర్చించి ఆ మేరకు నెల రోజుల్లోగా బలమైన కార్యాచరణ సిద్ధం చేసుకుందామని ఆయన భోరాసనిచ్చారు.