రైతు సమస్యల పరిష్కారం కొరకు చిత్తశుద్ధితో పనిచేస్తున్న రైతు స్వరాజ్య వేదిక నాయకులపై బీఆర్ఏస్ నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను టీజేఏస్ అధినేత కోదండరాం తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఇందుకు సంబంధించి ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
రైతు స్వరాజ్య వేదిక అందరికీ తెలిసిందే. రైతుల ఆత్మహత్యల మీద అధికార గణాంకాల నుంచి వాస్తవంగా గ్రామాల్లో సమాచారాన్ని సేకరించారు. ఈ సమాచారాన్ని అందరూ ఉపయోగిస్తున్నారు.
ఈ లెక్కలు, సమాచారం తప్పు అనుకుంటే బీఆర్ఎస్ నాయకులు ఖండించవచ్చు. ప్రజాస్వామ్యం అంటేనే చర్చ.. నచ్చని అభిప్రాయాలను ఎవరైనా ఖండించవచ్చు.
కానీ టీజేఎస్ నాయకులను ఉరికించి.. ఉరికించి కొడతామని బీఆర్ఎస్ నాయకులు బెదిరింపులు చేయడం కరెక్ట్ కాదన్నారు. ప్రకటన చేసినందుకే దాడులు చేస్తామని చెప్పడం అనాగరికమన్నారు కోదండరాం.