ప్రభుత్వం ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి..! - TJS Chief Prof Kodandaram Fires On KCR Over Ravi prakash Illegal Arrest- Tolivelugu

ప్రభుత్వం ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి..!

టీవీ 9 వ్యవస్థాపకుడు రవి ప్రకాష్ అరెస్ట్ ను తెలంగాణ జన సమితి పార్టీ ఖండిస్తోంది . సివిల్ వ్యవహారాన్ని క్రిమినల్ కేసు గా పరిగణించే కేసు పెట్టి జైల్లో పెట్టడం అన్యాయం .ఆస్తుల పంపకాలు , ఆర్ధిక లావాదేవీల గొడవలను పరిష్కరించుకోవడానికి కోర్టుల్లో కేసులు వేసుకోవచ్చు .కానీ ఆ కేసుల పరిష్కారానికి ప్రభుత్వమే రంగంలోకి దిగడం , ఒక పక్షానికి అనుకూలంగా వ్యవహరించడం చట్ట విరుద్ధం , అన్యాయం . మీడియా స్వేచ్ఛను హరించడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఇది . tv9 , మోజో ను కూడా అందులో భాగంగానే తీసుకున్నారు .తోలివేలుగు వెబ్ ఛానల్ వేదికగా అనేక వాస్తవాలు బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు . వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని , ప్రజలు తిరగబడతారని ప్రభుత్వ కోపానికి కారణమైంది .రవి ప్రకాష్ అరెస్ట్ కేవలం మీడియా స్వేచ్ఛను హరించడానికే . ఇప్పటికైనా ప్రభుత్వం రవి ప్రకాష్ పై పెట్టిన కేసులు ఉపసంహరించుకొని , విడుదల చేయాలనీ డిమాండ్ చేస్తున్నాను

Share on facebook
Share on twitter
Share on whatsapp