ఒకప్పుడు ఉద్యోగ సంఘాలనే కాదు, రాజకీయ పార్టీలను సైతం కలుపుకొని ఒక్కతాటిపై నడిపించిన నాయకుడు కోదండరాం. తెలంగాణ ఉద్యమం, రాష్ట్రం ఏర్పడటంలో జేఏసీ చైర్మన్ గా కీలకంగా వ్యవహరించిన కోదండరాం… సీఎం కేసీఆర్ ఎత్తులపై మండిపడ్డారు.
ఉద్యోగులందర్నీ సమానంగా చూడాలని… కానీ ఉపాధ్యాయులను వేరు చూసి చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఉపాధ్యాయులైనా, ఇతర ఉద్యోగస్థులైనా అందరూ ఉద్యోగులేనని… అందరికీ పీఆర్సీ, రాయితీలు ఒకే విధంగా కంటిన్యూ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పీఆర్సీని ఆలస్యం చేస్తూ, ఆ విమర్శల నుండి తప్పుకునేందుకు ఉద్యోగ సంఘాల్లో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు.
వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ప్రొ. కోదండరాం… తన ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఉద్యమ ఆకాంక్షలు, ఉద్యమకారులకు జరుగుతున్న అన్యాయం, విద్య-ఉద్యోగాల్లో ప్రభుత్వ అలసత్వంపై ఆయన గ్రాడ్యుయేట్లకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.