ఆ ఇద్దరి కోసమే రాష్ట్రం అప్పులపాలు - Tolivelugu

ఆ ఇద్దరి కోసమే రాష్ట్రం అప్పులపాలు

ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలకు రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారని విమర్శించారు టీజెఎస్ నేత కోదండరాం. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆరోపించారు. ఆర్టీసీ నష్టాల్లో ఉందని ప్రైవేటు పరం చేస్తానంటోన్న కేసీఆర్, మరీ ప్రభుత్వాధాయం ఎందుకు పడిపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కోదండరాం సంఘీభావం ప్రకటించారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కేసీఆరే కారణం అని, సమ్మె విజయవంతం అయ్యేందుకు తెలంగాణ సమాజం కార్మికులకు తోడుంటుందని తెలిపారు. ఆంధ్రా పాలకులనే తరిమికొట్టిన మనకు కేసీఆర్ మెడలు వంచటం పెద్ద పనేం కాదని, 19న బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp