కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సంక్షోభంలో కూరుకుపోయిన సినీ పరిశ్రమకు మంచి రోజులు మొదలయ్యాయి. ఇప్పటికే సినిమా షూటింగ్‌లు గతంలోలా యధావిధిగా కొనసాగుతుండగా.. కొన్ని పరిమితులతో థియేటర్లను తెరుచుకునేందుకు ఇప్పటికే కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే 50 శాతం మాత్రమే ఆక్యుపెన్సీతో నడపాలని సూచించింది. సగం సీట్లతోనే నడిపిస్తే లాభాలు రావన్న ఉద్దేశ్యంతో చాలా మంది నిర్మాతలు సినిమా విడుదల చేసేందుకు ముందుకు రాలేదు. పూర్తి సీట్లతోనే హాళ్లు నడిపించేందుకు పర్మిషన్ దొరికినప్పుడే సినిమాలు రిలీజ్ చేయాలని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్రం మార్గదర్శకాలతో సంబంధం లేకుండా.. ఇకపై 100 శాతం సీట్లతో థియేటర్లు నడుపుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన జీవో కూడా జారీ చేసింది. కొత్త రకం స్ట్రెయిన్‌తో మళ్లీ ఆంక్షలు విధిస్తారేమోనని ఇండస్ట్రీ భయపడుతోంటే.. అందుకు భిన్నంగా తమిళనాడు ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా ప్రభుత్వ నిర్జయంపై కోలివుడ్ హర్షం వ్యక్తం చేస్తోంది.