సీఎం కు టీఎన్జీవోల సరెండర్ వెనుక ఇది కథ? - Tolivelugu

సీఎం కు టీఎన్జీవోల సరెండర్ వెనుక ఇది కథ?

ఎందుకు తెలంగాణ కీలక ఉద్యోగ సంఘాల నాయకులు కేసీఆర్ కు జై కొడుతున్నారు…? తోటి ఉద్యమకారులను ఎందుకు పట్టించుకోవటం లేదు…? టీఎన్జీవోల అవినీతి చిట్టా సీఎం చేతిలో ఉన్నందుకేనా…?

నీ అవినీతి బాగోతం నాచేతిలో ఉండగా ఎంత దూరం వెళ్తావ్ లే… అన్నట్లు, టీఎన్జీవో నేతల అవినీతి సీఎం చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే… కేసీఆర్ చెప్పినట్లు టీఎన్జీవోలు తలూపారు. వాళ్ళు కార్మికులు, మీరు అధికారులు… పైగా ప్రభుత్వం లోకి రావటం మీ భవిష్యత్ పిఆర్సీలపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది, ప్రబుత్వలెప్పుడు బడ్జెట్ తోనే చూస్తాయి అంటూ తియ్యని మాటలతో సీఎం కేసీఆర్ హెచ్చరించినట్లు టీఎన్జీవోల్లో బలంగా వినిపిస్తోంది

అయితే… అవినీతి చిట్టా అంశం లోతుగా పరిశీలిస్తే…. నిబంధనలకు విరుద్ధంగా కోట్ల విలువైన గచ్చిబౌలిలో హోసింగ్ సొసైటీ కి కేటాయించిన వాటిలో నాయకులు చేతివాటం ప్రదర్శించి ఖైరీదైన భూముని తమ వారికి కట్టబెట్టుకున్నట్లు సీఎం కు సమాచారం ఉంది. ఇక ఇతర అక్రమ కట్టడాలకు లెక్కే లేదని… ఆ చిట్టా అంత సీఎంకు చేరిందని…. ఆ తర్వాతే ఉద్యోగ నాయకులను పిలిపించుకున్నారని ప్రగతి భవన్ వర్గాలంటున్నాయి.

Share on facebook
Share on twitter
Share on whatsapp