ఆర్టీసీ కార్మికులను మాతో పోల్చొద్దు తొలివెలుగు తో TNGO అధ్యక్షుడు - Tolivelugu

ఆర్టీసీ కార్మికులను మాతో పోల్చొద్దు తొలివెలుగు తో TNGO అధ్యక్షుడు

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ప్రతిపక్ష నాయకుల కనుసన్నల్లో జరుగుతుందని మాట్లాడిన తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులూ , తెలంగాణ సమాజం నుండి వచ్చిన ఒత్తిడి మేరకు ఆర్టీసీ సమ్మె కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి . ఈ సమయంలో TNGO అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి తొలి వెలుగు ఎన్కౌంటర్ విత్ రఘు షో లో మాట్లాడారు .
ఆర్టీసీ సంఘాలు మాతో సంప్రదించకుండా సమ్మె కు వెళ్లిందని ,మా మద్దతు ముందే అడిగి ఉంటె ఆలోచించే వాళ్లమని చెప్పారు . అదే సమయంలో కొందరు రాజకీయ నేతలు మాపై బురద జల్లే ప్రయత్నం చేసారని దీన్ని ఖండిస్తున్నామన్నారు .
ఎవరి ఒత్తిడి మాపై లేదన్నారు . కెసిఆర్ తో లంచ్ మీటింగ్ లో అసలు ఆర్టీసీ కార్మికుల గురించిన చర్చలు జరగలేదన్నారు .కేవలం మా ఉద్యోగుల సమస్యల మీదే మాట్లాడమన్నారు . కెసిఆర్ ని కలవడం లో తప్పేం లేదన్నారు . ఆర్టీసీ ఉద్యోగులతో , మమ్మల్ని పోల్చొద్దన్నారు .ఎవరి సర్వీస్ రూల్స్ వారికి ఉంటాయన్నారు .
పలు రాజకీయ అంశాలపై కూడా కారెం రవీందర్ రెడ్డి స్పందించారు .
అయన ఇంకా ఏమన్నారో కింది వీడియో లో చుడండి …..

 

Share on facebook
Share on twitter
Share on whatsapp