గుంటూరు: గ్రామ సచివాలయాల పరీక్ష పత్రాల లీకేజీ ఆరోపణలపై రాష్ట్రంలో ఆందోళనలు మొదలయ్యాయి. టీఎన్‌ఎస్ఎఫ్‌కు చెందిన విద్యార్ధి నాయకులు ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. నియామక ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఏపీపీఎస్సీ కార్యాలయం దగ్గర భారీగా పోలీసు బందోబస్తు చేపట్టారు.