ది నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కరోనా బారిన పడిన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆమె కరోనా నుంచి కోలుకున్నప్పటికీ వయసు రీత్యా అవయవాల వైఫల్యం తో ఆదివారం తుది శ్వాస విడిచింది. అయితే లతా మంగేష్కర్ మృతి తర్వాత ఆమె ఆస్తుల విషయంపై మీడియాలో చర్చ మొదలయ్యాయి.
లతా మంగేష్కర్ చిన్న వయసులోనే సింగర్ గా మారారు. 70 ఏళ్లు పాటలు పాడారు. అయినప్పటికీ ఆమె ఒంటరిగానే ఉన్నారు. తోబుట్టువులందరిలో పెద్దది కావడం, చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతను ఆమె చూసుకోవాల్సి వచ్చింది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం లత ఆస్తుల విలువ దాదాపు 200 కోట్ల రూపాయలట. ఇందులో ఆమె నివాసాలు, బంగారం, భూమి ఇలా చాలా ఉన్నాయట. ఆమె ప్రతి సంవత్సరం 5 కోట్ల రూపాయల సంపాదిస్తున్నట్లు ఒక అంచనా.
ఇక లత సోదరీమణులు, ఆశా భోంస్లే, మీనా ఖాదికర్, ఉషా మంగేష్కర్ , హృదయనాథ్ మంగేష్కర్ కూడా గాయకులే. అయితే ఇప్పుడు లత ఆస్తులు తోబుట్టువులందరికీ బదలాయిస్తారనే చర్చ సాగుతోంది. మరోవైపు లత తన ఆస్తులను తన తండ్రి పేరున ఉన్న ట్రస్ట్ కు రాసి ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
అయితే దీనిపై త్వరలోనే లత తరఫు న్యాయవాది ప్రకటన చేయనున్నారట.