తెలంగాణపై కరోనా ప్రతాపం కొనసాగుతోంది. రాష్ట్రంలో నిన్న 56 వేల 217 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 2,216 మందికి పాజిటివ్ అని నిర్దారణ అయింది. కాగా పరీక్షలు చేయించుకున్నవారిలో ఇంకా 2345 మంది ఫలితాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య లక్షా 57వేలకు చేరింది. కరోనా కారణంగా నిన్న 11 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 961కి పెరిగింది. తెలంగాణలో నెల రోజులుగా.. రోజువారీ కేసులు 2 వేలకు పైన నమోదవుతుండగా.. మరణాల సంఖ్య సగటున 10-13కు పరిమితమవుతోంది.
నిన్న జీహెచ్‌ఎంసీ పరిధిలో 341 పాజిటివ్ కేసులు బయటపడగా.. ఆ తర్వాత రంగారెడ్డి 210, మేడ్చల్ 148, నల్గొండ 126, కరీంనగర్ 119, ఖమ్మం 105, వరంగల్ అర్బన్ జిల్లాలో 102 కేసులు వెలుగుచూశాయి
మరోవైపు కరోనా నుంచి నిన్న 2603 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య లక్షా 24 వేలకు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31 వేల 600 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఇందులో 24 వేల 674 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 21 లక్షల 34 వేలకుపైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.