ఏపీలో కరోనా కేసులు క్రమేణా తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతిరోజు 1000 లోపు కేసులు వస్తున్నప్పటికీ తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. కాగా గడిచిన 24 గంటలలో కొత్తగా 685 కేసులు నమోదయ్యాయి. అందులో అత్యధికంగా కృష్ణాజిల్లాలో 146 శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 3 కేసులు నమోదయ్యాయి.
మరోవైపు గడచిన 24 గంటల్లో నలుగురు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7427 కేసులు ఉన్నాయి. ఇక తాజా లెక్కల ప్రకారం ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,68,749 కు చేరుకుంది. మరోవైపు ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మరణాల సంఖ్య 6996 కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 1094 మంది కరోనా నుంచి కోలుకున్నారు.