గత కొన్ని రోజుల నుంచి స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్ల అంచనాలను తలకిందలు చేస్తుంది. ఈ రోజు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ నేల చూపులు చూసింది. సుమారు 900 పాయింట్లు కోల్పోయి 57 వేల 12 వద్ద స్థిరపడింది. ఉదయం మార్కెట్.. స్టార్ట్ అయిన సమయంలో స్వల్ప లాభాలు కనిపించినా.. తరువాత పతనం అవుతూ వచ్చింది. ఓ దశలో 950 పాయింట్లకుపైగా పతనమైంది.
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ కూడా ఈ రోజు పతనమైంది. 263 పాయింట్లు తగ్గి 16 వేల 985 వద్ద ముగిసింది. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. ఆటో, ఆర్థిక రంగం షేర్లు భారీగా పడిపోయాయి. దేశీయ మార్కెట్లలో వీదేశీ మదుపరులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. దీని ప్రభావం మార్కెట్ పై పడటంతో ఇన్వస్టర్లు ఎక్కువ నష్టాలతో వెనుదిరుగుతున్నారు.